
అగ్రరాజ్యం అమెరికా కు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ కంపెనీ టెస్లా కు ఫ్లోరిడా కోర్టు భారీ జరిమానా విధించింది. 2019లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి అప్పట్లో టెస్లా కంపెనీ పై కేసు నమోదైంది. టెస్లా కారులోని ఆటో పైలట్ వ్యవస్థ లో లోపంవల్లే ఆ ప్రమాదం జరిగిందని తాజాగా ఫ్లోరిడా కోర్టు తేల్చింది. బాధిత కుటుంబానికి 240 మిలియన్ డాలర్ల పరిహారం (భారత కరెన్సీలో సుమారుగా రూ.1,996 కోట్లు) చెల్లించాలని టెస్లాను ఆదేశించింది. ఈ ఘటనలో 22 ఏళ్ల యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. సుదీర్ఘ విచారణ అనంతరం తాజాగా ఫ్లోరిడా కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ ప్రమాదానికి నష్టపరిహారంగా బాధిత కుటుంబాలకు మొత్తం 329 మిలియన్ డాలర్లు చెల్లించాలని కోర్టు కారు యజమానిని ఆదేశించిం
















