అగ్ర కథానాయిక తమన్నాపై మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాదాస్పద ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ మహాదేవ్‌కు అనుబంధ యాప్‌గా ఉన్న ఫెయిర్ ప్లే కోసం తమన్నా ప్రచారకర్తగా పనిచేసింది. ఈ యాప్ ద్వారా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేస్తున్నారు. ఈ నేప థ్యంలో ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ జియో సినిమా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి తమన్నా పై ఫిర్యాదు చేసింది. ఫెయిర్ ప్లే యాప్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు చూడమని తమన్నా చెప్పడం నిబంధ నలకు విరుద్ధమని జియో సినిమా తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ కైంప్లెంట్‌ను స్వీకరించిన ముంబయి సైబర్ పోలీసు లు వచ్చే వారం విచారణకు హాజరుకావాలని తమన్నాకు సమన్లు జారీ చేశారు.