Namaste NRI

భారతీయ విద్యార్థుల కోసం… హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్

భారతీయ విద్యార్థుల కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2022ను  నిర్వహిస్తున్నట్లు ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ వెల్లడించింది. ఈ ఫెయిర్ సల్మియా ప్రాంతంలోని భారతీయ కమ్యూనిటీ స్కూల్ సీనియర్ బ్రాంచీలో డిసెంబర్ 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు ఉంటుంది. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రవేశాలు కోరుకునే పేరెంట్స్, విద్యార్థులకు ఈ ఫెయిర్ సువర్ణావకాశం అని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.

ఇక ఈ ఫెయిర్ ప్రముఖ బిజినెస్ స్కూల్స్, మెడిసిన్, ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన భారత్, విదేశాలలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. వీరు ప్రస్తుతం అందుబాటులో ఉన్న తాజా విద్యావకాశాలపై ఈ ఫెయిర్‌లో అవగాహన కల్పిస్తారని నిర్వాహహకులు వెల్లడించారు. ఈ ఫెయిర్‌కు ప్లాటినం స్పాన్సర్‌లుగా మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, జైన్ యూనివర్సిటీ వారు వ్యహరిస్తున్నారు.  ఈ అవకాశాన్ని కువైత్‌లోని భారతీయ తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress