Namaste NRI

అమెరికా చరిత్రలోనే తొలిసారి : జో బైడెన్

జనవరి 6 అమెరికా చరిత్రలోనే ఇది బ్లాక్‌ డే అని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. యూఎస్‌ క్యాపిటల్‌పై ట్రంప్‌ మద్దతుదారుల దాడి జరిగిన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా  జో బైడెన్‌ స్పందించారు. తొలిసారిగా ఒక అధ్యక్షుడు ఎన్నికల్లో ఓడిపోవడమే కాక, శాంతియుత అధికార మార్పిడికి తీవ్ర ప్రతిఘటనకు ప్రయత్నించాడు. ప్రజాస్వామ్యపు గొంతుకకు బాకును గురిపెట్టడానికి ఎవ్వరినీ అనుమతించను. ముమ్మాటికీ ఇది సాయుధ తిరుగుబాటు. మాజీ అధ్యక్షుడు 2020 ఎన్నికలు జరగకముందే రిగ్గింగ్‌ జరుగుతుందని ప్రచారం చేశాడు. జవనరి 6న క్యాపిటల్‌ భవనంపై దాడి చేయించడం ద్వారా వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు అతను తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ చర్యలతో అతను అమెరికా చరిత్రలోనే అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. నువ్వు గెలిస్తే తప్ప నీ దేశాన్ని ప్రేమించలేవా? అని బైడెన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events