
చరిత్రలోనే తొలిసారిగా విమానాల తయారీ సంస్థ బోయింగ్ అతిపెద్ద ఆర్డర్‌ను పొందింది. 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17 లక్షల కోట్లు)తో 160 విమానాల కొనుగోలుకు బోయింగ్‌కు ఖతార్ ఎయిర్‌వేస్ ఆర్డర్‌ను ఇచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.ఇది బోయింగ్ సంస్థకు లభించిన అద్భుతమైన ఆర్డర్ అని ఆయన ప్రశంసించారు. మూడు మధ్య ప్రాచ్య దేశాల పర్యటనలో భాగంగా ఆయన రెండో దేశమైన ఖతార్‌లో పర్యటించారు.
