
గగనతలంలో శత్రుదేశాల యుద్ధ విమానాల్ని కూల్చడానికి మిస్సైల్‌ను ఉపయోగించటమన్నది ఇప్పటివరకు విన్నాం. ప్రపంచంలో మొదటిసారిగా తుర్కియే గగనతల దాడులకు మానవ రహిత యుద్ధ విమానాన్ని ని సిద్ధంచేసింది. దీని సామర్థ్యాన్ని పరీక్షించేందుకు చేపట్టిన ట్రయల్స్‌లో ఒక జెట్ విమానాన్ని కూల్చి, అది సంచలనం సృష్టించింది. తుర్కియే దేశీయంగా అభివృద్ధి చేసిన రాడార్, మిస్సైల్ టెక్నాలజీతో అత్యంత అధునాతనమైన బేరక్తర్ కిజెలెల్మా అనే యూఏవీని తయారుచేసింది. తాము తయారుచేసిన యూఏవీ అత్యంత కచ్చితమైన ప్రదర్శన చూపిందని, ఎక్కడో జెట్ స్పీడ్‌తో వెళ్లే విమానాన్ని గుర్తించి, దానిపైకి మిస్సైల్‌ను పంపి కూల్చిందని తుర్కియే రక్షణ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
















