Namaste NRI

1960వ తర్వాత మొట్టమొదటిసారి…అమెరికాలో

అమెరికాలో 1960వ దశకం తర్వాత మొట్టమొదటిసారి వలసదారుల జనాభా గణనీయంగా తగ్గినట్లు ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేపట్టిన కఠిన ఇమిగ్రేషన్‌ చర్యలే ఇందుకు కారణమని తేలింది. ఈ ఏడాది జనవరి-జూన్‌ మధ్య అమెరికాలో దాదాపు 15 లక్షల మంది వలసదారులు తగ్గారని, దీంతో దేశంలో ఉన్న మొత్తం వలసదారుల జనాభా 5.19 కోట్లకు తగ్గిపోయిందని అధ్యయన నివేదిక పేర్కొంది. ఇమిగ్రేషన్‌ నిబంధనలను కఠినంగా అమలుచేయడం, సామూహిక దేశ బహిష్కరణలు, చట్టపరమైన ఎంట్రీ రూట్లలో వచ్చేవారి సంఖ్య తగ్గడం వంటివి వలసదారుల సంఖ్య తగ్గడానికి కారణమని నివేదిక తెలిపింది. అయితే దేశంలో జనాభా తగ్గడం వల్ల తలెత్తే ఆర్థికపరమైన పరిణామాలను కూడా నివేదిక ప్రస్తావించింది.

దేశంలోని కార్మిక శక్తిలో 7.50 లక్షల వలసదారులు తగ్గడం వల్ల అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తోందని, ముఖ్యంగా వలస కార్మికులపై ఆధారపడిన పరిశ్రమలలో దీని ప్రభావం కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. స్థానికంగా పనిచేసే వయసున్న కార్మికుల సంఖ్య పెరగకపోవడం వల్ల వలస కార్మికులే పరిశ్రమలకు ప్రధాన వనరుగా ఉన్నారని ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌కు చెందిన సీనియర్‌ సభ్యుడు జెఫ్రీ పజల్‌ పేర్కొన్నారు. వలస కార్మికులు తగ్గిపోవడం వల్ల ఆర్థిక ప్రగతి, ఉత్పాదకత పడిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News