Namaste NRI

ముమ్మాటికీ ఇది నరమేథమే : ఫస్ట్‌ లేడీ జెలెన్‌ స్కా

రష్యా దండయాత్రలో చోటుచేసుకున్న పౌరుల మరణాలపై ఉక్రెయిన్‌ ప్రథమ మహిళ వొలెనా జెలెన్‌స్కా మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా  అంతర్జాతీయ మీడియాకు ఆమె బహిరంగ లేఖ విడుదల చేశారు.దేశ ప్రజలపై సామూహిక హత్యలకు రష్యా పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. రష్యా జరిపిన దాడుల్లో చిన్నారులు మృతి చెందినట్లు తెలిపారు. ఉక్రెయిన్‌కు శాంతి కావాలని, దేశ సరిహద్దుల్ని రక్షించుకుంటామని, తమ ఐడెంటీని కోల్పోమన్నారు. ప్రస్తుతం జెలెన్‌స్కా ఎక్కడ ఉన్నారో తెలియదు.  మహిళా దినోత్సవం నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడి వెబ్‌సైట్‌లో జెలెన్‌స్కా తన స్టేట్‌మెంట్‌ను రిలీజ్‌ చేశారు. ఇంటర్వ్యూల కోసం చాలా అభ్యర్థనలు వచ్చాయని, కానీ ఈ లేఖతో తాను సమాధానం ఇస్తున్నట్లు తెలిపారు. రష్యా చేపట్టిన ఆక్రమణను నమ్మలేకపోతున్నామని, మా దేశం ప్రశాంతంగా ఉందని, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో జీవితాలు సాఫీగా సాగుతున్నాయన్నారు. కానీ మన ప్రజల్ని రష్యా మర్డర్‌ చేస్తోందన్నారు.  ప్రస్తుతం జెలెన్‌స్కా ఎక్కడా తెలియదు. కానీ రష్యా తమ కుటుంబాన్ని టార్గెట్‌ చేసినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events