
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అన్నా డిఎంకె బహిష్కరణ నేత పన్నీర్ సెల్వం అధికార డిఎంకె పార్టీలో చేరారు, సిఎం స్టాలిన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.చెన్నైలోని పార్టీ కార్యాలయంలో పన్నీర్ సెల్వం, తన కుమారుడు మాజీ ఎంపీ రవీంద్ర నాథ్ తో పాటు ఎమ్మెల్యే అయ్యప్పన్ కూడ డిఎంకె లో చేరారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత విధేయుడైన పన్నీర్ సెల్వం మూడు సార్లు ముఖ్యమంత్రి గా చేసారు. అన్నా డిఎంకె ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామితో రాజకీయ విరోధం నేపధ్యంలో పన్నీర్ సెల్వం ఆయన అనుచరులు 2022 లో పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు.ఆ తర్వాత ఎన్డీఏ తో కూడా సంబంధాలు కోల్పోయిన ఆయన ఇప్పుడు డిఎంకెతో చేతులు కలిపారు.















