అమెరికా మాజీ సెనెటర్ అధ్యక్ష అభ్యర్థి బాబ్ డోల్(98) కన్నుమూశారు. 1945 యుద్ధంలో వెన్నెముకకు అయిన గాయం కారణంగా డోల్ కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. అనంతరం మూడేళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అలా యుద్ధంలో తగిలిన గాయాలను అధిగమించిన బోల్ అనంతరం కాన్సస్ నుంచి సెనెట్‌కు ప్రాతినిధ్యం వహించారు. డోల్ స్టేజ్`4 ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు అయ్యేందుకు డోల్ మూడుసార్లు ప్రయత్నించారు. సెనెట్‌లో అనర్గళంగా ప్రసంగించే నాయకుడిగా గుర్తింపు తెచ్చకున్నారు. డోల్ కన్నుమూసిన విషయాన్ని ఆయన సతీమణి ఎలిజబెత్ బోల్ ట్విటర్ వేదికగా వెల్లడిరచారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)