అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా దంపతులు విడిపోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇద్దరూ కూడా గత కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారని సమాచారం. ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఒబామా ఒక్కరే పాల్గొంటారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
అంతేకాకుండా ఇటీవల మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు ఒబామా ఒక్కరే పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో ప్రస్తుత అధ్యక్షుడు బైడైన్ దంపతులు, కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ఫ్యామిలీ సహా, మాజీ అధ్యక్షుల దంపతులం తా హాజరయ్యారు. కానీ ఒబామా ఒక్కరే సింగిల్‌గా పాల్గొన్నారు. దీంతో ఒబామా దంపతులు విడిపోతున్నట్లు సమాచారం. జిమ్మీ కార్టర్ అంత్యక్రియలకు అందరూ హాజరైతే, మిచెల్ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి.