Namaste NRI

ఫోర్బ్స్ సంపన్న మహిళల జాబితాలో నలుగురు భారతీయ అమెరికన్లు

ఫోర్బ్స్ 2023 మహిళా సంపన్నుల జాబితా  లో నలుగురు భారతీయ-అమెరికన్‌ వనితలు చోటు దక్కించుకున్నారు. జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథి, నేహా నార్ఖేడే, ఇంద్రా నూయి ఈ కీర్తి గడించారు. అమెరికాలో అత్యంత విజయవంతమైన, సగటు సంపద 124 బిలియన్‌ డాలర్లు కలిగిన వంద మంది మహిళా వ్యాపారవేత్తలు, ఎగ్జిక్యూటివ్‌ల సరసన నిలిచారు. వీరి సంపద గత ఏడాది కంటే 12 శాతం ఎక్కువ.

ఏళ్ల జయశ్రీ ఉల్లాల్‌ సిలికాన్ వ్యాలీ ఇంజినీర్, సిస్కో మాజీ నిఫుణురాలు. ఫోర్బ్స్ 2023 సంపన్న మహిళల ర్యాంకులో 15వ స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 2.2 బిలియన్ డాలర్లు.నీర్జా సేథి, ఫోర్బ్స్ 2023 స్వీయ మహిళా సంపన్నుల ర్యాంకులో 25వ స్థానంలో ఉన్నారు. ఆమె నికర సంపద విలువ 990 మిలియన్‌ డాలర్లు. నీర్జా సేథి1980లో మిచిగాన్‌లోని ట్రాయ్‌లో సొంత అపార్ట్‌మెంట్‌లో భర్త భరత్ దేశాయ్‌తో కలిసి ఐటీ కన్సల్టింగ్, ఔట్‌సోర్సింగ్ సంస్థ సింటెల్‌ను స్థాపించారు.

నేహా నార్ఖెడే, ఫోర్బ్స్ 2023 మహిళా సంపన్నుల ర్యాంకులో 50వ స్థానంలో నిలిచారు. ఆమె నికర ఆస్తుల విలువ 520 మిలియన్‌ డాలర్లు. నేహా నార్ఖెడే, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి వ్యాపారవేత్తగా మారారు.ఇంద్రా నూయి, ఫోర్బ్స్ 2023 స్వీయ మహిళా సంపన్నుల ర్యాంకులో 77వ స్థానంలో ఉన్నారు. ఆమె నికర సంపద విలువ 350 మిలియన్‌ డాలర్లు. అమెరికాలోని టాప్‌ 50 కంపెనీలలో ఒకటైన పెప్సికోను చాలా కాలం సమర్థవంతంగా నిర్వహించారు. భారత్‌లోని చెన్నైలో జన్మించిన ఆమె, అమెరికా టాప్‌ కంపెనీలో అతి పెద్ద బాధ్యతలు చేపట్టిన తొలి అమెరికాయేతర మహిళ. 12 ఏళ్ల పాటు పెప్సికో సీఈవోగా ఉన్న ఆమె 2018లో ఆ పదవికి, 2019లో ఛైర్‌పర్సన్‌గా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం అమెజాన్‌ సంస్థతోపాటు, హెల్త్ టెక్ సంస్థ ఫిలిప్స్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events