Namaste NRI

ఫ్రాన్స్ అమ్మాయి.. బిహార్ అబ్బాయి.. మూడు ముళ్లతో ఒక్కటైన జంట

ఫ్రాన్స్‌కు చెందిన మ్యారీ లోరీ ఆరేళ్ల క్రితం ఢల్లీిని విజిట్‌ చేయడానికి ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో బిహార్‌లోని బెగుసరైకు చెందిన టూర్‌ గైడ్‌ రాకేశ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడిరది. ఆ పరిచయం తొలుత స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. మ్యారీలో లోరీ ఢల్లీి పర్యటన ముగించుకుని తిరిగి ఫ్రాన్స్‌కు వెళ్లినప్పటికీ వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. మూడేళ్ల క్రితం రాకేశ్‌ కూడా తన పనికి స్వస్తిపలికి ప్యారీస్‌ బాటపట్టాడు. అక్కడ మ్యారీ లోరీతో కలిసి టెక్స్‌టైల్‌ బిజినెస్‌ను ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో మ్యారీ లోరీ మనసులో మాటను తన తల్లిదండ్రుల వద్ద వ్యక్త పరిచింది.

                 రాకేశ్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కూతురి ప్రేమను ఆ తల్లిదండ్రులు అర్థం చేసుకున్నారు. మ్యారీ లోరీ, రాకేశ్‌ల పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. దీంతో రాకేశ్‌ కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య మ్యారీ లోరీ మెడలో తాళి కట్టి హిందూ వైవాహిక సంప్రదాయం ప్రకారం బెగుసరైలో తాజాగా పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి మ్యారో లోరీ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు. కొన్ని నెలలు భారత్‌లో గడిపిన తరువాత కొత్త జంట మళ్లీ ప్యారిస్‌ వెళ్లిపోనుంది. ప్రేమకు హద్దుల్లేవని మరోసారి నిరూపితమైంది. ప్యారిస్‌లో వ్యాపారం చేస్తున్న ఓ మహిళా భారత్‌లో టూర్‌ గైడ్‌గా పని చేస్తున్న రాకేశ్‌ను పెళ్లి చేసుకోవడం ఆశ్చర్యంగానే ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events