ఫ్రాన్స్ పార్లమెంట్ చారిత్రక బిల్లును ఆమోదించింది. అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చింది. ఈ మేరకు రాజ్యాంగాన్ని సవరించింది. సోమవారం జరిగిన ఉభయ సభల సమావేశంలో దీనిపై ఓటింగ్ నిర్వహించగా, 780-72 ఓట్లతో బిల్లుకు ఆమోదం లభించింది. దీంతో అబార్షన్ హక్కును రాజ్యాంగంలో చేర్చిన తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. పార్లమెంట్ ఆమోదం నేపథ్యంలో మహిళా హక్కుల కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.
