Namaste NRI

హనుమాన్ మూవీ నుంచి.. మహా మాస్ అప్‌డేట్

ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న తాజా చిత్రం హనుమాన్. భార‌తీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఈ సినిమా రానుంది. ఇందులో జాంబి రెడ్డి కథానాయకుడు. తేజ సజ్జా  హీరోగా న‌టిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి మహా మాస్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ సినిమాలో కోటి అనే కోతి పాత్ర‌కు టాలీవుడ్ న‌టుడు మాస్ మహారాజా రవితేజ డ‌బ్బింగ్ చెప్పిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. హనుమాన్ లో కోటి పాత్రనే హైలెట్ అని సమాచారం.

హనుమాన్‌ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కే నిరంజన్‌ రెడ్డి తెరకెక్కిస్తుండగా,  కోలీవుడ్ భామ అమృతా అయ్యర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి గౌరా హరి-అనుదీప్ దేవ్‌, కృష్ణ సౌరభ్‌ సంయుక్తంగా మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీకి అస్రిన్‌ రెడ్డి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా, వెంకట్‌ కుమార్‌ జెట్టీ లైన్‌ ప్రొడ్యూసర్‌గా, కుశాల్‌ రెడ్డి అసోసియేట్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తేజ సజ్జా, ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో హనుమాన్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా నుంచి వ‌చ్చిన టీజ‌ర్‌తో పాటు ట్రైల‌ర్‌లు హాలీవుడ్ స్థాయి విజువల్స్‌తో అందరినీ ఇంప్రెస్ చేస్తున్నాయి. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events