రాజ్ భీమ్‌రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం జయహో ఇండియన్స్. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. మతం పేరుతో జరుగుతున్న మారణకాండలో బలయ్యేదెవరు? నాయకులా? అమాయకులా? లేక దేశమా? అనే అంశాల్ని చర్చిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాలోని వీడియోసాంగ్‌ను విడుదల చేశారు. జయహో ఇండియన్స్ ఆంథమ్ ఇది. చక్కటి సాహిత్యంతో ఆకట్టుకుంటుంది. ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలో తెలియజేస్తాం అన్నారు. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్. ఈ చిత్రానికి కెమెరా: జైపాల్‌రెడ్డి నిమ్మల, సంగీతం: సురేష్ బొబ్బిలి, కథ స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఆర్.రాజశేఖర్ రెడ్డి. రాజ్ భీమ్‌రెడ్డి నిర్మాత.