Namaste NRI

శ్రీ విష్ణు విష్ణు విన్యాసం నుంచి.. బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మొదలే మొదలే రిలీజ్

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం విష్ణు విన్యాసం. యదునాథ్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని సుమంత్‌ నాయుడు నిర్మిస్తున్నారు.ఈ నేపథ్యంలో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. ఈ సినిమా నుంచి మొదలే మొదలే.. అనే పాటను విడుదల చేశారు. విన్నాలే వింటున్నానే మనసున నీ మాట. అన్నాలే అంటున్నాలే బదులుగా నా మాట.. అలా అలా వెళ్లిపోతూ మళ్లీ మళ్లీ నిన్ను చూశా.. మిలా మిలా రెప్పచాటు మౌనరాగాలన్నీ చదివేశా అంటూ చక్కటి ప్రేమ భావాలను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. రథన్‌ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించారు.

ఈ పాటలో నాయకానాయికలు శ్రీవిష్ణు, నయనసారిక కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్‌, మురళీశర్మ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సత్యం రాజేష్‌ తదితరులు నటిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: రథన్‌, నిర్మాణ సంస్థ: శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌, రచన-దర్శకత్వం: యదునాథ్‌ మారుతీరావు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events