శ్రీలంకకు జీ7 దేశాలు అండగా నిలిచాయి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు జీ7 దేశాల ఆర్థిక మంత్రులు శ్రీలంకను గట్టెక్కించేందుకు సహాయ సహకారాలు అందజేస్తామని ప్రకటించారు. 1948లో స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా లంక అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విదేశీ మారకద్రవ్యం కొరత కారణంగా దేశీయంగా భారీగా ధరల పెరుగుదలకు దారి తీసింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కొరత ఏర్పడిరది. ఈ క్రమంలోనే గ్రూప్ ఆఫ్ సెవెన్ (జీ7) దేశాలు శ్రీలంకకు సహాయం చేస్తామని ప్రకటించాయి. ఈ నిర్ణయంపై లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే స్వాగతించారు.














