సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (TCSS) నూతన కార్యవర్గాన్ని ఎనుకున్నది. సింగపూర్‌లోని ఆర్య సమాజ్‌లో తొమ్మిదో వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. టీసీఎస్‌ఎస్ కార్యవర్గానికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో రమేశ్ బాబు ప్యానల్ మినహా మరెవరూ పోటీలో నిలబడలేదు. ఈ సందర్భంగా టీసీఎస్‌ఎస్ నూతన అధ్యక్షుడిగా గడప రమేశ్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో గడప రమేశ్ బాబు ప్యానల్ ఏకకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు వినయ్ కుమార్, ముద్రకోల నవీన్ ప్రకటించారు.
అధ్యక్షుడిగా గడప రమేష్ బాబు ఎన్నికవగా, ప్రధాన కార్యదర్శిగా బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారిగా జూలూరి సంతోష్ కుమార్, సంస్థాగత కార్యదర్శిగా కాసర్ల శ్రీనివాస రావు, ఉపాధ్యక్షులుగా నల్ల భాస్కర్ గుప్త, గోనె నరేందర్ రెడ్డి, మిర్యాల సునీత రెడ్డి, దుర్గ ప్రసాద్ మంగలి, కార్యవర్గ సభ్యులుగా పెరుకు శివరామ్ ప్రసాద్, అనుపురం శ్రీనివాస్, బొడ్ల రోజారమణి, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, రాధికా రెడ్డి, సదానందం అందె, రవి చైతణ్య మైసా, విజయ మోహన్ వెంగళ, ప్రాంతీయ కార్యదర్శులుగా నంగునూరి వెంకట రమణ, బొండుగుల రాము, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజ్జాపూర్ ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా గడప రమేశ్ బాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వాసులకు సేవ చేసే అవకాశం లభించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో నీలం మహేందర్, సొసైటీ సంస్థాగత అధ్యక్షుడు బండా మాధవ రెడ్డి, గర్రెపల్లి శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్ చెన్నోజ్వల, గార్లపాటి లక్ష్మారెడ్డి, కొల్లూరి శ్రీధర్, గింజల సురేందర్ రెడ్డి, వినయ్ కుమార్ పెద్దపల్లి తదితరులు పాల్గొన్నారు.