ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గం..గం..గణేశా. ఉదయ్‌శెట్టి దర్శకుడు. ఈ చిత్రాన్ని కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఓ కొండ అంచున నిలబడి ఉన్న ఆనంద్ దేవరకొండ గన్ ఫైర్ చేయడం, ఆ గన్ నుంచి గులాబి రేకులు బయటకు వస్తున్నట్లు డిజైన్ చేసిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిం చామని, ఈ వేసవిలో ప్రేక్షకులకు కొత్త అనభూతినందిస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ప్రగతి శ్రీవాస్తవ, కరిష్మా, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్ తదితరులు నటిస్తున్నారు. మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి, సంగీతం: చేతన్ భరద్వాజ్, రచన-దర్శకత్వం: ఉదయ్‌శెట్టి.