స్వీయ దర్శకనిర్మాణంలో చంద్రశేఖర్ రాథోడ్ హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్‌స్టర్. కాశ్వీ కాంచన్ కథానాయిక. ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను రచయిత సాయిమాధవ్ బుర్రా ఆవిష్కరించారు. ఈ సందర్భం గా మాట్లాడిన ఆయన టీజర్, ట్రైలర్ అద్భుతంగా ఉన్నాయని అన్నారు. రెండు గ్యాంగ్స్ మధ్య పోరాటం నేపథ్యంలో ఆద్యంతం అనూహ్య మలుపులతో సాగే చిత్రమిదని దర్శకనిర్మాత చంద్రశేఖర్ రాథోడ్ తెలిపారు. అభినవ్ జనక్, అడ్ల సతీష్‌కుమార్ తదితరులు నటిస్తున్నారు. అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: జీఎల్ బాబు, సమర్పణ: రవి అండ్ నరసింహా, ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత, దర్శకత్వం: చంద్రశేఖర్ రాథోడ్.