తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఇంటి దొంగలుంటే నెలాఖరులోగా పార్టీలోంచి వెళ్లిపోవాలని డెడ్‌లైన్ విధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి దొంగలను వదిలే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. పెట్రో, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించింది. ఇందులో భాగంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్మల్‌లో నిరసన తెలిపారు. పార్టీ కోసం కష్టపడే వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటామని, ఇందులో సందేహమే లేదన్నారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేవారిని విడిచే ప్రసక్తే లేదని రేవంత్ వార్నింగ్ ఇచ్చారు.