రామ్‌తేజ్, వర్షిణి, మౌనిక ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం మల్లె మొగ్గ. తోట వెంకటనాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్.దామోదరప్రసాద్, సీనియర్ దర్శకుడు చంద్రమహేశ్ అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. తాను నటించిన మల్లెమొగ్గ సినిమా ప్రేక్షకా దరణ పొందడం ఆనందంగా ఉందని సీనియర్ నటుడు భానుచందర్ అన్నారు. మల్లెమొగ్గ సినిమాలాగే తన రాబోవు సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని హీరో రామ్‌తేజ్ ఆశాభావం వెలిబుచ్చారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు. అలాగే, రామ్‌తేజ్ హీరోగా ఈ సంస్థ నిర్మిస్తున్న కొత్త చిత్రం తథాస్తు పోస్టర్‌ని కూడా ఇదే వేడుకలో విడుదల చేశారు.