Namaste NRI

ఘాటి విడుదల ఆ రోజే

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్‌ అవైటెడ్‌ థ్రిల్లర్‌ అడ్వెంచర్‌ ఘాటి. విక్రమ్‌ ప్రభు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సమర్పణలో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది.

జూలై 11న ఘాటి విడుదలకాబోతున్నదని తెలియజేస్తూ మేకర్స్‌ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. అనుష్క, విక్రమ్‌ ప్రభు కలిసి ఓ నదిలో నుంచి సంచులు మోసుకుంటూ వెళ్తున్న విజువల్స్‌, వారి ఇంటెన్స్‌ జర్నీని ఈ పోస్టర్‌ సూచిస్తున్నది. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, కెమెరా: మనోజ్‌రెడ్డి కాటసాని, సంగీత: నాగవెల్లి విద్యాసాగర్‌, నిర్మాణం: ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటైర్టెన్మెంట్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events