Namaste NRI

ఘోష్‌  ట్రైలర్‌ వచ్చేస్తోంది

కింగ్‌ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న చిత్రం ది ఘోస్ట్‌. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై నారాయణదాస్‌ కె నారాంగ్‌, పూస్కుర్‌ రామ్మోహన్‌ రావు, శరత్‌  మరార్‌ నిర్మిస్తున్నారు. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్‌పుల్‌ ఇంటర్పోల్‌ ఆఫీసర్‌గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. ఈ నెల 25న ది ఘోస్ట్‌ థిjేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా పండక్కి అక్టోబర్‌ 5న తెరపైకి రాబోతున్నది. గుల్‌ పనాగ్‌, అనిఖా సురేంద్రన్‌ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్‌ : బ్రహ్మ కడలి, యాక్షన్‌: దినేష్‌ సుబ్బరాయన్‌, కేచ, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి. సంగీతం: మార్క్‌ కె రాబిన్‌, భరత్‌ సౌరబ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events