పవన్‌కల్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు. పోలీస్ గెటప్‌లో గబ్బర్‌సింగ్ ని తలపించేలా ఉస్తాద్ భగత్‌సింగ్ ఉన్నాడని పలువరు అభిప్రాయపడుతున్నారు. గాజు పగిలేకొద్దీ పదునె క్కుద్ది.. గ్లాసంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం అనే డైలాగ్ పవన్‌కల్యాణ్ పొలిటికల్ కెరీర్‌ని దృష్టిలోపెట్టుకొని రాసినట్టుగా ఉంది. పవన్‌కల్యాణ్ పాత్రన.స్టైలిష్ గా, అత్యంత శక్తిమంతంగా దర్శకుడు హరీష్‌శంకర్ డిజైన్ చేసినట్టు టీజర్ చెప్పకనే చెబుతున్నది. పవన్ పవర్‌ఫుల్ పంచ్ డైలాగులు, పవన్ గన్స్ ఫైర్ చేయడం టీజర్‌లో హైలైట్స్ అని మేకర్స్ చెబుతున్నారు. శ్రీలీల కూడా టీజర్‌లో కనిపిస్తున్నది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమాలో అశుతోష్ రానా, నవాబ్‌షా, కేజీఎఫ్ అనినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగమహేశ్, టెంపర్ వంశీ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అయనంక బోస్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాతలు: నవీన్ యెర్నని, వై.రవిశంకర్, నిర్మాణం: మైత్రీమూవీమేకర్స్.