Namaste NRI

గోల్డ్ రింగ్‌లు గిఫ్ట్ ఇచ్చిన పుతిన్… ఎవరికో తెలుసా?

కామ‌న్‌వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్‌(సీఐఎస్) దేశాధినేత‌ల‌కు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌  గోల్డ్ రింగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. బెలార‌స్ అధ్య‌క్షుడు అలెగ్జాండ‌ర్ లుక‌షెంకో, అజ‌ర్‌బైజాన్ అధ్య‌క్షుడు ఇలాహం అలియేవ్‌, క‌జ‌కిస్తాన్ అధ్య‌క్షుడు కాసిమ్ జోమార్ట్ టొక‌యేవ్‌, కిర్గిస్తాన్ అధ్య‌క్షుడు స‌దిర్ జప‌రోవ్‌, త‌జ‌కిస్తాన్ అధ్య‌క్షుడు ఎమ్మోలీ ర‌హ‌మాన్‌, తుర్క‌మిస్తాన్ అధ్య‌క్షుడు స‌ర్దార్ బెర్డిమువ‌మేదేవ్‌, ఉజ్బెకిస్తాన్ అధ్య‌క్షుడు ష‌వ‌క‌త్ మిర్జియోవేవ్‌, అర్మేనియా ప్ర‌ధాని నికోల్ ప‌షిన్యావ్‌లకు పుతిన్ బంగారు ఉంగ‌రాల‌ను అంద‌జేశారు. లుక‌షెంకో ఒక్క‌రే ఆ రింగ్ ఇచ్చిన వెంట‌నే తొడుక్కున్నారు. పుతిన్ కూడా త‌న కోసం ఓ రింగ్‌ను ఉంచుకున్నారు.

ఆ ఉంగ‌రాల‌పై కామ‌న్‌వెల్త్ గుర్తు ఉంది. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్‌లో జ‌రిగిన స‌మావేశంలో మొత్తం 8 మంది దేశాధినేత‌ల‌కు ఆయ‌న ఉంగ‌రాల‌ను ప్ర‌జెంట్ చేశారు. ఆ రింగ్‌ల‌పై హ్యాపీ న్యూ ఇయ‌ర్ 2023 అని ప్రింట్ చేసి ఉంది. స‌మావేశం జ‌రుగుతున్న ర‌ష్యా దేశం పేరు కూడా ఆ రింగ్‌ల‌పై ఉన్న‌ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events