తమిళ అగ్ర నటుడు అజిత్‌కుమార్ నటిస్తున్న భారీ పానిండియా సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. తిష కృష్ణన్ కథానాయిక. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నా రు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ డేట్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో తుపాకీ చేతబట్టి సోఫాలో కూర్చున్న అజిత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇందు లోని అజిత్ పాత్రలో మల్టీ లేయర్లుంటాయని, దర్శకుడు అధిక్ రవిచంద్రన్ అద్భుతమైన కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో ప్రభు, ప్రసన్న, అర్జున్ దాస్, సునీల్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అభినందన్ రామానుజం, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.