చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. భారీ స్థాయిలో ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ తన ఆరు ప్రధాన వ్యాపార విభాగాలన్నింటిలో కలిపి ఈ ఏడాది ఏకంగా 15,000 మందిని నియమించుకోనున్నట్లు తెలిపింది. చైనీస్ మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ విబో ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. తాజా నియామకాల్లో ఫ్రెషర్స్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపింది. కొత్త నియామకాల్లో 3,000 మంది యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేయనున్నట్లు వెల్లడించింది.


