Namaste NRI

అమెరికా శుభవార్త

ప్రపంచ దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై కోటీ ఆశలతో ఎదురుచూస్తున్నాయి. పెద్దన్న ట్రాక్‌లో పడితే కానీ తమ కష్టాలు కొలిక్కిరావని చాలా మందికి తెలుసు. ఇటువంటి తరుణంలో ప్రపంచ దేశాలకు ఊరట ఇచ్చే  ఒక వార్త అమెరికా నుంచి వచ్చింది.. జో బైడెన్‌ ప్రభుత్వానికి సైతం ఇది చాలా కీలకమైనదని చెప్పుకోవాలి. శుభవార్త ఇదే. ఇంకెన్నాళ్లు వడ్డీ రేట్ల పెంపు, అధిక ద్రవ్యోల్బణం అని భావిస్తున్న అందరికీ అమెరికా విడుదల చేసిన తాజాగా డేటా కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మూడవ త్రైమాసికం డేటా ప్రకారం జీడీపీ వృద్ధి 2.6 శాతంగా ఉంది. అంతకు ముందు రెండు త్రైమాసికాల్లో అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడం అందరినీ హడలెత్తించింది. తాజా  వివరాలు వెలువడడంతో బైడెన్‌ ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. దీనితో బలపడిన ఆర్థిక మాంద్యం భయాలకు బ్రేక్‌ పడినట్లు కనిపిస్తోంది.

            ఆర్థిక సంవత్సరం జనవరి` మార్చి మొదటి త్రైమాసికంలో అమెరికా వృద్ధి 1.6 శాతం ఉండగా, రెండవ త్రైమాసికంలో జీడీపీ 0.6 శాతంగా ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మాంద్యం వైపు వెళ్లడం లేదని జులైలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇచ్చిన హామీ ఈ విధంగా కార్యరూపం దాల్చినట్లు తెలుస్తోంది. జులైలో నిరుద్యోగం గురించి అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పరిస్థితులు చక్కబడతాయన్న నమ్మకాన్ని  వ్యక్తం చేశారు. మనం మాంధ్యం వైపు వెళుతున్నామని నును అనుకోను అని బైడెన్‌ అప్పట్లో చెప్పారు. గడిచిన 40 ఏళ్లలో అమెరికా ద్రవ్యోల్బణం ఇంత భారీ స్థాయిలో చేరుకోవడం ఇదే తొలిసారి కావడం, వడ్డీ రేట్లు అమాంతం పెరగడం భారత్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపాయి.

Social Share Spread Message

Latest News