నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ఎన్‌బీకే 108. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. ఉగాది పండగ సందర్భంగా బాలకృష్ణ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. ఎన్‌బీకే 108 నుంచి బాలకృష్ణ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ సారి మీ ఊహలకు అందని విధంగా. అంటూ బాలకృష్ణ కోరమీసంతో ఉన్న లుక్‌ను షేర్ చేసింది షైన్ స్క్రీన్ బ్యానర్.అన్న దిగిండు.. ఈసారి మీ ఊహకు మించి అందరికి మాస్ ఫీస్ట్ అందించారు మేకర్స్.
ఈ సారి కూడా బాలకృష్ణ రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తున్నాడు. బాలకృష్ణ చేతిపై టాటూ కనిపిస్తోంది. అభిమానులు ఖచ్చితంగా ఇదివరకెన్నడూ చూడని విధంగా ఎన్‌బీకే 108లో బాలయ్య కనిపించబోతున్నాడని తాజా స్టిల్స్ తో అర్థమవుతోంది. రెండు పోస్టర్లు మాస్ అప్పీల్‌లో కనిపిస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతోంది.
