చాట్‌జీపీటీ సెర్చ్ ఇంజిన్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇప్పటివరకు పెయిడ్ యూజర్ల కు మాత్రమే అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ సెర్చ్ ఇంజిన్, ఇకపై ఉచితంగా అందరికీ అందుబాటులోకి రానున్నది. ఈ విషయాన్ని ఓపెన్ ఏఐ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ కెవిన్ వీల్ ప్రకటించారు. ఇక నుంచి యూజర్లు చాట్‌జీపీటీ వెబ్‌సైట్, యాప్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. యూజర్ల నుంచి ఎలాంటి రుసుములూ వసూలు చేయటం లేదని కంపెనీ తెలిపింది.గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకుంది.