Namaste NRI

కరోనా రోగులకు గుడ్ న్యూస్ … ట్యాబ్లెట్ రూపంలో

కరోనా రోగులకు గుడ్‌ న్యూస్‌. ఇకపై కరోనా బారిన పడితే ఆసుపత్రి పాలు కావాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇంట్లోనే చికిత్స పొందే రోజులు రావొచ్చు. ఎందుకంటే ట్యాబ్లెట్‌ రూపంలో కరోనా మందు వస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా సంస్థ మెర్క్‌ రూపొందించిన ఔషదం ప్రయోగాల్లో మెరుగైన ఫలితాలు చూపించినట్లు వెల్లడిరచింది. కొత్తగా వైరస్‌ బారినపడుతోన్న బాధితులకు ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలను సగానికి తగ్గించినట్లు పేర్కొంది. మాత్రల రూపంలో తీసుకొచ్చిన ఈ ఔషధం త్వరలోనే అమెరికాలో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకోనున్నట్లు మెర్క్‌ ఫార్మా వెల్లడిరచింది.

కొవిడ్‌ 19ను ఎదుర్కోవడంలో మోల్నూపిరవిర్‌ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తోందని మెర్క్‌ నిపుణులు డాక్టర్‌ డీన్‌లీ పేర్కొన్నారు. అంతేకాకుండా వీటివల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా సాధారణంగా ఉన్నట్లు వెల్లడిరచారు. కొవిడ్‌ చికిత్సలో వినియోగిస్తోన్న ఇంజక్షన్‌ రూపంలో ఉన్న ఔషధాల కంటే మాత్రల రూపంలో ఉన్న ఈ ఔషధం బాధితులకు ఉపయుక్తంగా ఉండనుందని నిపుణులు భావిస్తున్నారు.

                                                                                                     

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events