యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యు పి ఐ) లావాదేవీ సంస్థ ఫోన్‌పే శ్రీలంకలో సేవలను ప్రారంభించింది. లంకాపేతో కలిసి సేవలను అందించనున్నట్లు ఫోన్‌పే ప్రకటించింది. భారతీయులు ఫోన్ పే యాప్‌తో లంకా పే క్యూ ఆర్ కోడ్‌ని స్కాన్ పే చేసి పే చేయచ్చని పేర్కొంది. శ్రీలంక అంతటా యూపీఐ సేవలను వినియోగించువకోచ్చని పేర్కొంది. శ్రీలంక పర్యటనకు వెళ్లే భారతీయ పర్యటాకులు నగదును తీసుకు వెళ్లనవసరం లేదని చెప్పింది. కరెన్సీ మారకం రేటును చూపుతూ, మొత్తం భారత రూపాయిలో డెబిట్ అవుతుందని పేర్కొంది. శ్రీలంక వెళ్లే భారతీయ పర్యాటకులకు సురక్షితమైన చెల్లింపు పద్ధతిని ఉపయోగించి లావాదేవీలు జరపవచ్చని ఫోన్‌పే ఇంటర్‌నేషనల్ పేమెంట్స్ సీఈవో రితేష్ పాయ్ పేర్కొన్నారు.
లంకాపే సహకారంతో సేవలు అందిస్తున్నామన్నారు. లంకాపే సీఈఓ చన్నా డి సిల్వా మాట్లాడుతూ భారతీయ పర్యాటకులు, బిజినెస్ ప్రయాణీకులకు శ్రీలంక పర్యటన సమయంలో చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరిచే దిశలో ఇది కీలక అడుగు అన్నారు. ఫోన్ పేతో కలిసి వారికి సేవలు అందిస్తుండడంపై సంతోషం వ్యక్తం చేశారు.