Skip to main content

Namaste NRI

భారతీయులకు శుభవార్త… ఇకపై అమెరికాలోనే

అమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్‌ నిపుణులకు శుభవార్త. ఇకపై వారు హెచ్‌1బీ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అమెరికాలోనే వాటిని రెన్యువల్‌ చేసుకోవచ్చు. ఇందుకు వీలు కల్పించే పైలట్‌ ప్రోగ్రామ్‌కు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌ హౌస్‌ ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి నియంత్రణ సంస్థ ఓఐఆర్‌ఏ (ఆఫీస్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ రెగ్యులేటరీ ఎఫైర్స్‌) ఈ నెల 15న ఆమోదం తెలిపింది. మూడు నెలలపాటు అందుబాటులో ఉండే ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద తొలుత 20 వేల మంది విదేశీయులకు హెచ్‌1బీ వీసాలను రెన్యువల్‌ చేస్తారు. దీంతో అమెరికాలో పనిచేస్తున్న ఎంతో మంది భారత టెక్‌ నిఫుణులకు లబ్ధి చేకూరుతుంది. అమెరికాలో పనిచేసే విదేశీ ఉద్యోగులకు హెచ్‌1బీ వీసా తప్పనిసరి. ఇప్పటివరకు ఈ వీసాలు పొందినవారు వాటిని పునరుద్ధరించుకునేందుకు స్వదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పైలట్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అమెరికాలోనే హెచ్‌1బీ వీసాల రెన్యువల్‌కు వీలుకల్పించడంతో విదేశీయు లు తమ వీసాల పునరుద్ధరణ కోసం స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

Social Share Spread Message

Latest News