భారతీయులకు గుడ్‌న్యూస్. ఇకపై ఇరాన్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు మరో 32 దేశాలకు పర్యాటకులు కూడా వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించవచ్చని తెలిపింది. ఇప్పటికే తుర్కియే, రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్, ఒమన్, చైనా, ఆర్మేనియా, లెబనాన్, సిరియా దేశాలకు వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. తాజాగా మరో 33 దేశాలకు కూడా మినహాయింపు ఇవ్వడంతో ఆ సంఖ్య 45కు చేరింది.
ప్రస్తుతం భారత్ నుంచి దౌత్య వ్యవహారాల కోసం ఇరాన్ వెళ్లే వారికి మాత్రమే వీసా మినహాయింపు ఉండేది. కానీ తాజా నిర్ణయంతో పర్యాటకులు కూడా వీసా లేకుండానే ఇరాన్‌లో పర్యటించవచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ పర్యాటక శాఖ మంత్రి ఎజ్జటొల్లా జర్ఘామీ వెల్లడించారు. దీనివల్ల తమ దేశంలోని పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.