సినిమా ప్రియులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వల్ల మూతపడ్డ థియేటర్లను 50 శాతం ఆక్యూపెన్సీతో నడిపించేందుకు జులై 8 నుంచి అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరింత వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 14 నుంచి 100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడిపేందుకు అవకాశం ఇచ్చినట్టు సమాచారం. థియేటర్లలోని వందశాతం సీట్లలో ప్రేక్షకులకు అనుమతివ్వడం, మరో వైపు దసరా సెలువులు కావడంతో సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
అర్థరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటలకు కర్ఫ్యూ సమయంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్. ఇక ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో రేపటి నుంచి విడుదల కాబోయే సినిమా భారీ ఊరట లభించనుంది.