నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మరో రెండు రోజుల్లో అదిరిపోయే అప్ డేట్ రాబోతుంది. మే 28న దివంగత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు, నందమూరి హీరోల చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్‌లు రానున్నాయి. దీంతో ఇపుడు మరొక సెన్షేషనల్ అప్‌డేట్ వచ్చింది. బసవతారక రామ క్రియేషన్స్ తమ మొదటి ప్రొడక్షన్‌ను అనౌన్స్ చేయటం జరిగింది. ఈ ప్రకటనను నందమూరి బాలకృష్ణ మే 28న ప్రకటించనున్నట్టు తాజాగా ఒక పోస్టర్ ద్వారా వెల్లడైంది. ఈ ప్రొడక్షన్ నవంబర్ వన్ 1పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎలాంటి అన్సౌమెంట్స్ వస్తుందని ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీస్ అనౌన్స్‌మెంట్‌పై సినీ పరిశ్రమ సైతం ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి బాలకృష్ణ కొత్త బ్యానర్‌లో ఎలాంటి సినిమా ప్రకటించబోతున్నాడని ఇంట్రెస్టింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్.














