Namaste NRI

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ .. ఉగాదికి ఉస్తాద్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తాజాగా ఈ సినిమా గురించి కీలక అప్‌డేట్స్ ఇచ్చారు మేకర్స్.ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు విడుదల తేదీని వారం ముందుకు మార్చినట్లు నిర్మాతలు ప్రకటించారు.

కొత్త షెడ్యూల్ ప్రకారం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 19న గ్రాండ్‌గా విడుదల కానుంది. హరీశ్‌శంకర్‌, పవన్‌కల్యాణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు విందుభోజనం లాంటి సినిమా ఇదని, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ గా పవన్‌కల్యాణ్‌లోని కొత్తకోణాన్ని చూస్తారని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి కథనం: కె.దశరథ్‌, రమేశ్‌రెడ్డి, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి, నిర్మాణం: మైత్రీ మూవీమేకర్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events