ప్రభాస్ ప్రస్తుతం కెరీర్‌లో బిజీ ఫేజ్‌లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ది రాజా సాబ్ మిశ్రమ స్పందన పొందినప్పటికీ, అభిమానుల్లో మాత్రం ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికే హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ కూడా తాజాగా సెట్స్‌పైకి వెళ్లింది. ఒకే సమయంలో ఈ రెండు భారీ సినిమాలను హ్యాండిల్ చేస్తూనే ప్రభాస్, తన కెరీర్‌లో కీలకమైన సీక్వెల్ కల్కి 2కి కూడా డేట్స్ కేటాయించడం విశేషంగా మారింది. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత ఈ సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

తాజా సమాచారం ప్రకారం కల్కి 2 షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుండగా, ప్రభాస్ మాత్రం మార్చి తర్వాత సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనికోసం ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. 2024లో విడుదలైన కల్కి 2898 AD వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభాస్ కెరీర్‌లో రెండో వెయ్యి కోట్ల చిత్రంగా నిలవడం విశేషం. భారీ విజువల్స్, కొత్త తరహా కథనం, మైథాలజీ–ఫ్యూచరిజం కలయికతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే విజయం కల్కి 2పై అంచనాలను రెట్టింపు చేయగా, తాజా షూటింగ్ అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెరుగుతోంది.















