జర్మనీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తమ దేశంలో విదేశీయులకు ఇచ్చే శాశ్వత నివాస అనుమతి ప్రక్రియను సులభతరం చేసింది. కొత్త రెసిడెన్సీ బిల్లుకు ఆమోదం తెలిపింది. 2022 జనవరి నాటికి ఎవరైతే దేశంలో ఐదేండ్లుగా ఉంటున్నారో వారంతా శాశ్వత నివాసం (పర్మినెంట్ రెసిడెన్సీ)కోసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించింది. ఐదేండ్లుగా దేశంలో 1.36 లక్షల మంది విదేశీయులు ఉన్నట్టు తెలింది. దరఖాస్తు చేసుకొన్న వారికి తొలుత ఏడాది కాలానికి రెసిడెన్సీ స్టేటస్ వస్తుంది. ఆ తర్వాత మళ్లీ దరఖాస్తు చేసుకొంటే పర్మినెంట్ రెసిడెన్సీ మంజూరు చేస్తారు.














