టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు మరో షాకిచ్చింది. గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ఈ సంస్థ 2024లో సైతం ఈ తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రకటనలు, అమ్మకాల విభాగం నుంచి వెయ్యి మందిని తొలగిస్తున్నట్టు గూగుల్ ఈ వారమే ప్రకటించింది. అయితే ఈ తొలగింపులు ఇంకా ఆగిపోలేదని, ఈ ఏడాది మరింత అధికంగా ఉంటాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ నిర్ధారించారు. ఈ సందర్భంగా లేఆఫ్ అన్న పదాన్ని వాడటాన్ని ఆయన వ్యతిరేకించారు. ఈ ఏడాది సంస్థ లో చేపట్టే భారీ మార్పుల గురించి ఇంటర్నెట్‌లో లీకైన ఆయన అంతర్గత మెమోలో వివరించారు. వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించారు.