సెర్చ్ ఇంజిన్ గూగుల్ భారత్‌లోని యూప్ డెవలపర్ల మధ్య ప్లే స్టోర్ ఛార్జీల వివాదం మరింత పెరిగింది. కొన్ని కంపెనీలు సర్వీస్ ఛార్జీలు చెల్లించకుండా తమ బిల్లింగ్ నిబంధనలు పదే పదే ఉల్లంఘిస్తున్నాయని పేర్కొం ది. ఇలాంటి వాటిపై విధానపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అవసరమైతే తమ ప్లే స్టోర్ నుంచి వాటిని తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు తమ బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది. భారత్‌లో 2 లక్షల కు పైగా డెవలపర్లు గూగుల్ ప్లే స్టోర్‌ను వినియోగిస్తున్నారని, వీరంతా తమ పాలసీకి అనుగుణంగా వ్యవహరి స్తున్నారని తెలిపింది. 10 కంపెనీలు మాత్రం కొంత కాలంగా గూగుల్ ప్లేలో తాము అందిస్తున్న సర్వీస్‌లకు ఛార్జీలు చెల్లించడంలేదని, ఇందులో ప్రముఖ స్టార్టప్‌లు ఉన్నాయని తెలిపింది. కోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందుతూ ఈ కంపెనీలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని గూగుల్ తెలిపింది.