సోషల్‌మీడియాలో వైరల్ అయ్యే ఫేక్ ఫొటోలను నివారించేందుకు గూగుల్ కొత్త టూల్‌ను తీసుకురానున్నది. కృత్రిమ మేధ సృష్టించిన ఫొటోలు సహజంగా కనిపిస్తుంటాయి. ఫేక్ ఫొటోనా? నిజమైన ఫొటోనా అనేది గుర్తించడం సవాలుగా మారింది. ఫేక్ ఫొటోలు వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకే గూగుల్ అబౌట్ దిస్ ఇమేజ్ పేరిట సరికొత్త టూల్‌ను అభివృద్ధి చేస్తున్నది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ టూల్ త్వరలో అందుబాటులోకి రానున్నది. దీన్ని ఉపయోగించి ఏఐ ఫొటోలకు గూగుల్ ప్రత్యేక లేబుల్‌ను వేయనున్నది. తద్వారా ఏఐ సృష్టించిన ఫేక్ ఫొటోలను సులువుగా నిర్ధారించవచ్చు. ఫేక్ వార్తల వ్యాప్తిని అరికట్టవచ్చు.


