Namaste NRI

గూగుల్ సంచలన నిర్ణయం.. ప్లే స్టోర్ నుంచి 14 లక్షల యాప్స్‌ను

చేతిలో స్మార్ట్ ఫోన్ లో లేకుంటే కాలం గడవని రోజులివి. పోనీ.. ఫోన్ ఉంటే సరిపోతుందా? అంటే కాదు,  దానికి ఇంటర్నెట్ కావాలి. ప్రతిదానికి ఒక యాప్ కావాలి. పోన్ కాలింగ్ నుంచి ఈ-కామర్స్ ఆర్డర్స్ వరకు అన్ని రకాల పనులు యాప్లోనే జరుగుతాయి. యూజర్ల సౌకర్యం కోసమంటూ గూగుల్ ప్లేస్టోర్ లో ఎన్నో రకాల యాప్స్ పుట్టుకొస్తున్నాయి. అయితే వీటిలో కొన్ని నకిలీ యాప్స్ కూడా ఉన్నాయి. యూజర్ల డేటా దొంగిలించడం కోసం సైబర్ నేరగాళ్లు వీటిని ఉపయోగిస్తున్నారు. గూగుల్ అలాంటి వాటిని గుర్తించి ఎప్పటికప్పుడు ప్లేస్టోర్ నుంచి తొలగిస్తుంటుంది. తాజాగా ఇలాంటి యాప్స్ గురించి గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లేస్టోర్ లోని సుమారు 14.3 లక్షల  యాప్ లపై నిషేధం విధించింది.

 

గూగుల్‌ నిబంధనలను అతిక్రమించిన 14.3 లక్షల యాప్‌లను గత ఏడాది ప్లే స్టోర్‌ నుంచి తొలగించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. అలాగే 1.73 లక్షల హానికరమైన డెవలపర్స్‌ను, ఫ్రాడ్‌ రింగ్స్‌ను బ్లాక్‌ చేసినట్టు వెల్లడించింది. మోసపూరిత, దుర్వినియోగమయ్యే రూ.200 కోట్లకు పైగా లావాదేవీలను నిరోధించినట్టు గూగుల్‌ తన సెక్యూరిటీ బ్లాగ్‌ పోస్ట్‌లో తెలిపింది. ప్లే స్టోర్‌ ఎకో సిస్టమ్‌లో చేరాలనుకునే డెవలపర్స్‌ కొత్తగా ఈమెయిల్‌, ఫోన్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలని నిర్దేశించింది. ప్లే స్టోర్‌లో హానికరమైన యాడ్స్‌ను నిరోధించేందుకు యాడ్స్‌ పాలసీని అప్‌డేట్‌ చేసినట్టు తెలిపింది. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events