ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో పెట్టుబడులు పెట్టాలని గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకున్నది. తాజా ఫండింగ్ రౌండ్ లో భాగంగా మైనారిటీ వాటా కొనుగోలు చేస్తామని గూగుల్ ప్రతిపాదించి నట్లు ఫ్లిప్ కార్ట్ మాతృసంస్థ వాల్‌మార్ట్ వెల్లడించింది. సీసీఐ, సెబీ తదితర నియంత్రణ సంస్థల అనుమతు లకు అనుగుణంగా గూగుల్‌ను మైనారిటీ ఇన్వెస్టర్‌గా చేర్చుకుంటామని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. అయితే తమ సంస్థలో గూగుల్ ఎంత పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తుందన్న సంగతి మాత్రం ఫ్లిప్ కార్ట్ బయట పెట్టలేదు. తమ వ్యాపార విస్తరణ, దేశవ్యాప్తంగా మరింత మంది కస్టమర్లకు సేవలు అందించడంతోపాటు డిజిటల్ మౌలిక వసతులను ఆధునీకరించడంలో గూగుల్ పెట్టుబడులు, గూగుల్ క్లౌడ్ సహకారం చేయూతనిస్తాయని ఫ్లిప్ కార్ట్ వివరించింది.