కరోనా కోత్త వేరియంట్ ఒమైక్రాన్ భయంతో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ క్రిస్మస్ సెలవుల దృష్ట్యా చాలా మంది ప్రజలు ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుని ఉంటారు. కానీ వారందరికి ఒక విషయం చెప్పదలచుకున్నా. అనవసరపు ప్రయాణాలను మానుకొండి. అటువంటి ప్రయాణాలకు ఇది సమయం కాదు. మెరుపు వేగంతో ఒమైక్రాన్ విజృంభిస్తోంది. ఇటువంటి సమయంలో ప్రయాణాలు అంత శ్రేయస్కరం కాదు. ప్రయాణ సమయంలో కొవిడ్ బారినపడే అవకాశం ఉంది. లేకపోతే ఇతర దేశాల్లో చిక్కుకునే అవకాశం కూడా ఉంది అని అన్నారు.














