కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తుపాకుల విక్రయాలు, దిగుమతిపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్లమెంట్లో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హ్యాండ్ గన్ ఓనర్షిప్ నిషేధాన్ని అమలు చేసేందుకు చట్టం తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. హ్యాండ్‌గన్ ఓనర్‌షిప్‌పై చట్టాన్ని పార్లమెంట్‌లోకి తీసుకురానున్న నేపథ్యంలో ఆమోదం పొందడం జస్టిన్ ట్రూడోకు సవాల్‌గా మారున్నది. ఎందుకంటే అధికార పార్టీకి పార్లమెంట్లో సీట్లు తక్కువగా ఉండడమే కారణం. ట్రూడో మాట్లాడుతూ హ్యాండ్ గన్ మార్కెట్‌ను పరిమితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తుపాకీ హింస పెరుగుతున్నట్లు అంగీకరించారు.
కెనడాలో అన్ని హింసాత్మక ఘటనల్లో తుపాకీ ప్రమేయం ఉన్న నేరాలు మూడు శాతం కంటే తక్కువగా ఉన్నాయని కెనడా ప్రభుత్వ గణాంకాల ఏజెన్సీ గత వారం తెలిపింది. కానీ, తుపాకీతో బెదిరింపుల తలసరి రేటు 2009 నుంచి దాదాపు మూడురెట్లు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో జరిగిన తుపాకీ నేరాల్లో మూడిరట రెండు వంతుల గన్ను వినియోగించారు.














