తమిళనాడులో సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కరోనా నిబంధనలు తప్పక పాటించాలని ఆదేశించింది. పోటీల్లో 300 మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతినిచ్చింది. జల్లికట్టులో పాల్గొనేవారు, నిర్వాహకులు, ప్రేక్షకులు రెండు డోసులు టీకాలు తీసుకొని ఉండాలని స్పష్టం చేసింది. ఎద్దు యజమాని, శిక్షకుడు మాత్రమే రిజిస్ట్రేషన్ సందర్భంగా అనుమతించనున్నట్టు చెప్పింది. అలాగే గడిచిన 24 గంటల వ్యవధిలో చేయించిన ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని ఆదేశించారు. పోటీలను వీక్షించేందుకు బహిరంగ ప్రదేశాల్లో 150 లేదా సీటింగ్ కెపాసిటీలో 50 శాతం మంది మాత్రమే ఉండాలని పేర్కొన్నది. పొంగల్ సందర్భంగా మదురై జిల్లాలో 14, 15, 16 తేదీల్లో జల్లికట్టు పోటీలు జరగనున్నాయి. వీటికి సంబధించిన పనులు ఇప్పటికే జరుగుతున్నాయి.
