సుహాస్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందుతున్నది. శివాని నగరం కథానాయిక. డెబ్యూ డైరెక్టర్ గోపి అచ్చర దర్శకత్వం. బి.నరేంద్రరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సత్యదేవ్ కెమెరా స్విచాన్ చేయగా, అగ్ర దర్శకుడు నాగ్ అశ్విన్ క్లాప్ ఇచ్చారు.

వంశీ నందిపాటి ఫస్ట్ షాట్‌కి గౌరవ దర్శకత్వం వహించారు. ఇందులో సుహాస్ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, యూనిక్ కాన్సెప్ట్‌తో అవుట్ అండ్ అవుట్ ఎంటైర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామని మేకర్స్ తెలిపారు. నరేష్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: షణ్ముఖ ప్రశాంత్, కెమెరా: మహిరెడ్డి పండుగల, నిర్మాణం: త్రిశూల్ విజనరీ స్టూడియోస్.
